22A నిషేధిత జాబితా పేరుతో భూదందాలా? కాంగ్రెస్‌–బీఆర్ఎస్‌పై బీజేపీ నేతల ఆరోపణలు!

తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా మరోసారి రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. నిషేధిత జాబితాలో భూముల చేర్పులు, తొలగింపుల పేరుతో భూయజమానులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. 22A జాబితా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు భూ వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు….

Read Full News

తెలంగాణలో 22A భూముల కలకలం.. అసలు ఏంటి ఈ నిషేధిత జాబితా? లక్షల ఎకరాలపై ఎందుకీ వివాదం?

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A నిషేధిత జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల రక్షణ కోసం ఉపయోగించిన నిబంధన ఇప్పుడు సామాన్య భూయజమానులకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తమకు స్పష్టమైన పట్టాలు, పాస్‌బుక్స్, పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని భూయజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

Read Full News

గ్రేటర్ ఎన్నికల్లో 22A ఎఫెక్ట్? ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కీలక నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22A నిషేధిత జాబితా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఆస్తులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులు కూడా 22A జాబితాలోకి వచ్చాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, లేఔట్లు, కమర్షియల్ ప్రాపర్టీలుగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు…

Read Full News