జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు…

