తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రుల పనితీరుపై AICC నజర్.. ఆరుగురికి ఉద్వాసన తప్పదా?

మంత్రి వర్గ విస్తరణకు ముందు పనితీరుపై గ్రేడింగ్‌? ముగ్గురు కొత్తవారికి ఇప్పటికే ఖాళీలు.. మరో ముగ్గురిపై వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం.. శాఖల మార్పులపైనా చర్చ! తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలోని సభ్యుల పనితీరుపై ఏఐసీసీ (AICC) ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. మంత్రులు తమ శాఖలను ఎలా నిర్వహిస్తున్నారు? ప్రతిపక్షాల విమర్శలకు ఎంత సమర్థంగా స్పందిస్తున్నారు? పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి?…

Read Full News

దసరాకు కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల పండుగ? 60 కార్పొరేషన్ పోస్టులపై హైకమాండ్ కసరత్తు!

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి చర్చ మొదలైంది. దసరా పండుగకు ముందే కీలక పదవులను భర్తీ చేయాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. సుమారు 60 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం ద్వారా దాదాపు 200 మంది నాయకులకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే, గతంలో పదవులు పొందిన వారిలో ఎంతమందికి మరోసారి అవకాశం దక్కుతుంది? పార్టీ కోసం కష్టపడిన కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా…

Read Full News

మీనాక్షి తర్వాత కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ ఎవరు? రేసులో కీలక నేతలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కీలక మార్పుపై చర్చ మొదలైంది. ఇప్పటివరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేసిన మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లనున్న నేపథ్యంలో.. ఆమె స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు అక్కడ ఉండనున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్…

Read Full News

ఆపరేషన్ కొండా.. సురేఖ రాజీనామా చేస్తారా? లేక మంత్రివర్గ ప్రక్షాళనతో సమస్యకు చెక్?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ వేదికగా కీలక చర్చలు జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సురేఖను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తోందా? ఆమె అందుకు అంగీకరించకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఒకవేళ ఆమెపై నేరుగా చర్యలు తీసుకుంటే పార్టీకి కొత్త సమస్యలు వస్తాయా? అనే అంశాలపై కాంగ్రెస్‌లో విస్తృతంగా…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పు? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదేనా!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు, కొండా సురేఖ వ్యవహారం, కొత్త వారికి మంత్రి పదవులపై ఆశలు.. వీటన్నింటి మధ్య మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “తెలంగాణ రాజకీయాల్లో మార్పు రాబోతుంది. ఆ మార్పులో నా పాత్ర చాలా కీలకం” అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఆయన చెప్పిన మార్పు ఏంటి? మంత్రివర్గంలో…

Read Full News

కొండా సురేఖపై వేటు తప్పదా? ఖర్గేను కలవనున్న భట్టి.. రేవంత్ వర్సెస్ కొండా వర్గంలో పెరుగుతున్న ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి చేరిన నేపథ్యంలో.. ఈ అంశంపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం, ఆ తర్వాత…

Read Full News

కొండా సురేఖకు దూరంగా మంత్రులు.. వన మహోత్సవానికి సీతక్క ఒక్కరే హాజరు? మంత్రి పదవిపై అధిష్ఠానంలో చర్చలు!

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ చుట్టూ నెలకొన్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల క్రమశిక్షణ వ్యవహారంపై టీపీసీసీ స్థాయిలో నివేదిక సమర్పించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆమె నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఇతర మంత్రులు, పార్టీ ముఖ్య నేతల హాజరు అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖకు సొంత పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు కనిపించడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఈ పరిణామాలను బట్టి కొండా…

Read Full News

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక.. ఇక నిర్ణయం ఏఐసీసీ చేతిలో!

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, నేతల వ్యాఖ్యల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమగ్ర నివేదికను సిద్ధం చేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అందించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కలిసి ఈ నివేదికను సమర్పించారు. ఇటీవలి పరిణామాల్లో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు…

Read Full News

నాడు జీవన్ రెడ్డి.. నేడు చిన్నారెడ్డి! తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త పోరు ఎటు? అసంతృప్తి నేతలంతా ఒక్కటవుతున్నారా?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పాత–కొత్త నేతల వివాదంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి తనకు పార్టీలో తగిన గుర్తింపు, పదవి లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కాంగ్రెస్‌కు…

Read Full News

కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు.. కళ్లెం వేసే నాయకుడు ఎవరు? పాత–కొత్త నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి క్రమంగా బహిర్గతమవుతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌కు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతల నుంచే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పదవులు దక్కలేదని కొందరు, పార్టీలో గుర్తింపు లేదని మరికొందరు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇంకొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత–కొత్త నేతల మధ్య…

Read Full News