టికెట్ ఇస్తామన్న హామీపై రప్పించి మోసం చేశారు.. మహిళా నాయకురాలి ఆవేదన

టికెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో మాట మార్చి తనను అవమానించారని మెట్పల్లి మున్సిపాలిటీ 24వ వార్డు మహిళా నాయకురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేశానని, మహిళలకు అండగా నిలబడి పార్టీ కోసం ప్రచారం చేశానని ఆమె తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. “నన్ను నైట్ దాకా కూడా టికెట్ కన్ఫర్మ్ అని చెప్పారు. ఉదయం 8:30 గంటల వరకూ ఫోన్ చేసి టీఫాం తీసుకుని రమ్మన్నారు. రెండు…

Read Full News

సూర్యపేట మున్సిపాలిటీలో టికెట్ల వ్యవహారం: డబ్బుల రాజకీయాలపై కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు

సూర్యపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ల పంపిణీపై తీవ్ర వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందని, కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి డబ్బున్నవారికే అవకాశాలు కల్పించిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సూర్యపేటకు ఇటీవల వచ్చిన సర్వోత్తం రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. గతంలో పార్టీ కోసం రక్తాలు చిందించిన కార్యకర్తలను ఈరోజు పట్టించుకోకుండా, డబ్బులు లేవన్న కారణంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు టికెట్లు నిరాకరించారని మండిపడ్డారు. ప్రత్యేకంగా…

Read Full News

రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నారు? విదేశీ పర్యటన, ఫ్లెక్సీలు, ద్వంద్వ ప్రమాణాలపై ప్రశ్నలు

ఎందుకు పరేషాను పరేషానురా” అన్న పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించేలా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? విదేశీ పర్యటన నుంచి వచ్చాక రాష్ట్రంలో కనిపిస్తున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకుని వచ్చినట్లుగా, ఏదో గొప్ప ఘనకార్యం చేసి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం…

Read Full News

హార్వర్డ్ నుంచి లీడర్షిప్ సర్టిఫికేట్: సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్య విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్‌లో “లీడర్షిప్ ఇన్ 21వ శతాబ్దం” కోర్స్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందడంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్‌గా ఎదిగానని నిరూపించుకోవాలన్న భావనతోనే ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లుగా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తిచేసి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్నట్టుగా సీఎం ఫోటోలు కనిపిస్తున్నాయని, ఇకపై ఎవరైనా “నువ్వు లీడర్ కాదురా” అని అడిగితే ఈ సర్టిఫికేట్…

Read Full News

వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేక సంకేతాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత అసంతృప్తి బయటపడుతోందా?

ఇటీవల ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల ఫీజుల దోపిడీపై వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, అది కేవలం విద్యా వ్యవస్థపై విమర్శగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్ష విమర్శగా కూడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నేను గనుక విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ కాలేజీల ఫీజులను కచ్చితంగా నియంత్రించేవాడిని, కాలేజీలను మూసివేసే వరకు వెళ్తాను” అని వెంకట్ రెడ్డి చెప్పడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో మీడియా–మంత్రుల నెక్సస్: బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో “చిచ్చు పెట్టేది ఎవరు?” అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక మంత్రుల మధ్య, మీడియా మధ్య నడిచే లోపలి ఆటలే పరిపాలనను గందరగోళంగా మారుస్తున్నాయా? అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ మొత్తం కథలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. భట్టి విక్రమార్కే ఈ వివాదానికి కేంద్ర…

Read Full News

ఎవరికి కట్టారు? ఎమ్మెల్యేల అయోమయం, పార్టీ మార్పులపై రాజకీయ వ్యంగ్యం

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలకు ఒకటే సందేహం – ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?పార్టీ మార్పులు, మాటల మార్పులు, స్టాండ్‌ల మార్పులతో ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. తాజాగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా ప్రకటించారు. అంతే కాదు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం “నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేదు,…

Read Full News

దానం నాగేంద్ర యూ–టర్న్: రాజీనామా భయం, అఫిడివిట్ డ్రామా, అనర్హత వేటకు తప్పించుకునే ప్రయత్నమా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక నెల క్రితం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా ప్రకటించిన దానం, తాజాగా మాత్రం “నేను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నాను” అంటూ స్పీకర్‌కు అఫిడివిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణ యూ–టర్న్ కాదు… ఇది రాజీనామా భయంతో తీసుకున్న రాజకీయ వెనకడుగుగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానంకు అనుకూలంగా లేవన్న ప్రచారం బలంగా…

Read Full News

ఆటో డ్రైవర్ల సమస్యలపై రాజకీయ నాటకాలు: కవిత స్టేట్‌మెంట్లలో స్పష్టత ఎక్కడ?

ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత ఇచ్చే స్టేట్‌మెంట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి.ఒకవైపు “బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు” అంటారు, మరోవైపు ఆటో డ్రైవర్లకు “రూ.12,000 ఇవ్వండి” అంటూ సడన్‌గా డిమాండ్ పెడతారు. పైగా ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్‌లోకి రానివ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఈ స్టేట్‌మెంట్లన్నీ చూస్తే రాజకీయంగా ఎదగాలనే తొందర తప్ప, సమస్యలపై స్పష్టత కనిపించడం లేదు. గత పదేళ్లుగా ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడని వారు, ఇప్పుడు ఒక్కసారిగా రూ.12,000 అంశాన్ని ముందుకు తేవడం…

Read Full News

లిక్కర్ స్కామ్ ఆరోపణలున్న కవితకు కాంగ్రెస్‌లో చోటు లేదు: మధు యాష్కి గౌడ్ స్పష్టం

లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి…

Read Full News