పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

