ఫారెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం… కీలక ఆధారాల భద్రతపై అనుమానాలు
రాష్ట్రంలో వరుసగా నమోదవుతున్న దొంగతనాల కేసుల దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఫారెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా క్లూస్ టీమ్ సేకరించిన కీలక ఆధారాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అగ్నికి ఆహుతయ్యాయా అన్న అంశంపై మూడు రోజులైనా అధికారిక స్పష్టత రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వెలువడకపోవడం వల్ల సందేహాలు మరింత పెరుగుతున్నాయి. వేలాది కేసుల భవిష్యత్ దర్యాప్తు, కోర్టు విచారణపై ఈ ఘటన ప్రభావం…

