పీరియడ్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? పెయిన్ కిల్లర్స్, పీరియడ్స్ పోస్ట్‌పోన్ మాత్రలు వాడితే ప్రమాదమా? నిపుణులు చెప్పిన ముఖ్య విషయాలు
హైదరాబాద్: పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం చాలా మంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. అయితే ప్రతి నెలా భరించలేనంత నొప్పి రావడం, అధిక రక్తస్రావం కావడం, పెద్ద పెద్ద రక్తం గడ్డలు (క్లాట్స్) పడటం, రోజువారీ పనులు చేసుకోలేని స్థాయిలో ఇబ్బందులు ఎదురవడం మాత్రం సాధారణం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. పీరియడ్ పెయిన్ ఎందుకు వస్తుంది? ప్రతి నెల గర్భాశయం (యూటరస్) గర్భధారణ కోసం సిద్ధమవుతుంది. ఈ ప్రక్రియలో…

