తహసీల్దార్ ఆస్తులు రూ.100 కోట్లకు పైనే? ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేశాని శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఏసీబీ అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోదాలు చేపట్టారు. మూడు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ సెటిల్మెంట్లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో…

Read Full News

మరోసారి ఏసీబీకి చిక్కిన డీఈ ముత్యం వెంకటరమణ.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులపై దర్యాప్తు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి భారీ అవినీతి కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులు…

Read Full News

జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా.. ఏసీబీ దాడుల్లో కళ్లుచెదిరే ఆస్తులు!

హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, భూముల పత్రాలు బయటపడినట్టు సమాచారం. ఏసీబీ…

Read Full News