కవిత ప్రభావం… బీఆర్ఎస్‌కు మైనస్ అయ్యిందా? పార్టీ భవిష్యత్తుపై చర్చలు

రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పాత్రపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆమె చర్యలు, వివాదాలు, పార్టీ అంతర్గత పరిణామాలు భారత రాష్ట్ర సమితి భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి ప్రజల్లో ఇంకా బలం ఉన్నప్పటికీ, నాయకత్వ స్థాయిలో స్పష్టమైన వ్యూహం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారంలో లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వినడంలో పార్టీ నేతలు వెనుకబడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, సామాన్య వర్గాలతో ప్రత్యక్ష…

Read Full News

హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ల కిడ్నాప్ డ్రామా… వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం, జాగృతికి షాక్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. హంగ్ ఫలితాలు వచ్చిన చోట ఇండిపెండెంట్ కౌన్సిలర్ల కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేయడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులను తమ శిబిరాల్లోకి తీసుకెళ్లేందుకు బలవంతం చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డుల్లో బిఆర్ఎస్ 13, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఐతో కలిసి 13 స్థానాలు గెలవగా, నాలుగు స్వతంత్రులు విజయం సాధించారు. దీంతో…

Read Full News

మున్సిపల్ ఫలితాల్లో డబ్బు రాజకీయాలు, స్వతంత్రుల ఉధృతి – కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీపై ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర విమర్శలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లైవ్ చర్చలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసినప్పటికీ, విస్తృతంగా డబ్బులు పంచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూలిపోలేదని అన్నారు. కాంగ్రెస్ 80–90 శాతం గెలుస్తామని చెప్పి చివరికి బీఆర్ఎస్ చేతిలో చుక్కలు చూశిందని వ్యాఖ్యానించారు. ఈ విజయం కేవలం కాంగ్రెస్ పార్టీదే కాదని, ఇది ఐదు ప్రతిపక్షాల సమిష్టి విజయమని అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా ఐడియాలజీని వదిలేసి…

Read Full News

ఆటో డ్రైవర్ల సమస్యలపై రాజకీయ నాటకాలు: కవిత స్టేట్‌మెంట్లలో స్పష్టత ఎక్కడ?

ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత ఇచ్చే స్టేట్‌మెంట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి.ఒకవైపు “బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు” అంటారు, మరోవైపు ఆటో డ్రైవర్లకు “రూ.12,000 ఇవ్వండి” అంటూ సడన్‌గా డిమాండ్ పెడతారు. పైగా ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్‌లోకి రానివ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఈ స్టేట్‌మెంట్లన్నీ చూస్తే రాజకీయంగా ఎదగాలనే తొందర తప్ప, సమస్యలపై స్పష్టత కనిపించడం లేదు. గత పదేళ్లుగా ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడని వారు, ఇప్పుడు ఒక్కసారిగా రూ.12,000 అంశాన్ని ముందుకు తేవడం…

Read Full News

ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌లో అంతర్గత దయ్యాలు: సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు, కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ఉద్యమకారులకు దూరమవుతున్న పార్టీ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా సంతోష్ రావు ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, అమరవీరుల కుటుంబాలు, పేద ప్రజలకు దూరమవడానికి కారణం ఒక వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు పార్టీ విడిచిపోవడానికి కూడా ఇదే…

Read Full News

రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం: కవితకు కాంగ్రెస్ నేతల గట్టి హెచ్చరిక

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు. గతంలో కవిత బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆమె మాటలు, వ్యవహారశైలిపై పలుమార్లు ఖండించామని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో బయటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్…

Read Full News

తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…

Read Full News

అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై విశ్లేషణ

అసెంబ్లీ బాయికాట్ వెనుక అసలు లాజిక్ ఏంటి? కవిత స్పీచ్, కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ విశ్లేషణ తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు ఈసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర, ముఖ్యంగా బీఆర్‌ఎస్ వైఖరి రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో “ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తా” అనే వ్యాఖ్యలు…

Read Full News

2025లో బిఆర్ఎస్–బిజెపీలకు చేదు అనుభవాలు.. కవిత బాంబు, బీజేపీ అంతర్గత కలహాలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్, బిజెపీలకు తీవ్రంగా కలిసి రాని ఏడాదిగా మారిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ విషయంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న స్టాండ్ పార్టీకి పెద్ద షాక్‌గా మారాయి. ఈ పరిణామాన్ని చాలామంది “కవిత బాంబు”గా అభివర్ణిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు బయటపడటం, కుటుంబ సభ్యురాలే బహిరంగంగా మాట్లాడటం పార్టీకి నష్టం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025లో బిఆర్ఎస్‌కు వరుసగా ఎదురైన ప్రతికూల పరిణామాలు, జూబ్లీ హిల్స్…

Read Full News

కొత్త రాజకీయ శక్తిగా జాగృతి – ప్రజల కోసమే కవితక్క పోరాటం : జాగృతి నేతతో ఓకే టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్న జాగృతి ఉద్యమం, కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాగృతి కీలక నేత తన అభిప్రాయాలను నిస్వార్థంగా, నిర్భయంగా వెల్లడించారు. “నేను జర్నలిస్ట్‌గా మాత్రమే కాదు, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా, ప్రజల ప్రయోజనాలు కాపాడే పౌరుడిగా మాట్లాడుతున్నాను” అని స్పష్టం చేసిన ఆయన, అబద్ధ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలను…

Read Full News