కేబీఆర్ పార్క్ వద్ద కొత్త వన్‌వే రూట్.. మాదాపూర్, ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు!
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త వన్‌వే విధానం అమల్లోకి రావడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు, ట్రాఫిక్ మళ్లింపుల నేపథ్యంలో ఈ మార్పులను అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూట్లు, మళ్లింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రకటనలు, సైనేజ్‌లు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం వన్‌వే విధానాన్ని అమలు చేశారు….

