ఆర్టీఓ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!
వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఆర్టీఓ చలాన్ APK” పేరుతో జరుగుతున్న ఈ మోసంలో వాహనదారులకు WhatsApp, SMS, MMS ద్వారా సందేశాలు పంపుతూ “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే జరిమానా చెల్లించండి” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఒక లింక్ ఇచ్చి, దాని ద్వారా APK ఫైల్ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఆ ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే…

