ఓల్డ్ సిటీ మెట్రో పనులకు వేగం.. యంగ్ ఇండియా స్కూళ్లపై కొత్త చర్చ
హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన మెట్రో కారిడార్‌కు సంబంధించి భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రోజురోజుకూ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో సాంకేతిక అంశాలపై…

