హైదరాబాద్ చెరువుల రక్షణలో హైడ్రా దూకుడు.. 10 ఏళ్ల రోడ్‌మ్యాప్‌తో భారీ మార్పులు!
హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న హైడ్రా, నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికతో పని చేస్తోందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఆనంద్ థియేటర్ సమీపంలోని నాలా ఆక్రమణలను తొలగించిన ఘటనను అధికారులు ఉదాహరణగా చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఆక్రమణల కారణంగా నాలా వెడల్పు భారీగా తగ్గిపోయి, వర్షాకాలంలో…

