రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ..? నిరుద్యోగుల ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మళ్లీ ఉధృతమయ్యాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత మరోసారి ధర్నాకు దిగింది. గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో…

