గ్రేటర్ హైదరాబాద్‌లో 22A షాక్.. లక్షల కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలోకి?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల యజమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్ తదితర వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A పరిధిలోకి ప్రైవేట్ ఆస్తులు కూడా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీల యజమానులు అయోమయంలో పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్,…

