ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన.. రూ.120 కోట్ల బకాయిల విడుదలకు డిమాండ్, రీచ్‌ల మూసివేత హెచ్చరిక

తెలంగాణలో ఇసుక తవ్వకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే కార్యకలాపాలు నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా సుమారు రూ.120 కోట్ల రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు ఇటీవల టీజీఎండీసీ (TGMDC) అధికారులను కలిసి బకాయిల సమస్యను వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం…

Read Full News

దుల్లపల్లిలో నకిలీ ఓఆర్సీ మాయాజాలం.. భూ అక్రమ దందాపై సంచలన ఆరోపణలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దుల్లపల్లి గ్రామంలో మరో భూ అక్రమ దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే నెంబర్ 154లో జరిగిన భూ వివాదాలపై ఫిర్యాదులు నమోదవుతుండగా, తాజాగా సర్వే నెంబర్ 155లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తూ నకిలీ పత్రాల ఆధారంగా భూములను విక్రయించారని, అసలు యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, దుల్లపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 155లోని రెండు…

Read Full News

భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read Full News

కొర్రెముల కబ్జాలపై కొరడా.. 150 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు

మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొర్రెముల్లలో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం కదిలింది. దిశా దినపత్రిక వరుస కథనాల తర్వాత రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867తో పాటు పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా…

Read Full News

ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు…

Read Full News

గిరిజన భూములు, నిర్మాణ ప్రాజెక్టులపై వివాదం – తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆరోపణలు

గిరిజన భూములు, నిర్మాణ ప్రాజెక్టులు, రెవెన్యూ రికార్డులపై ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కొన్ని ప్రాంతాల్లో భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు అనే అంశంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా గిరిజన భూములపై నిర్మాణాలు జరుగుతున్నాయా? వాటికి అనుమతులు ఎలా మంజూరు అయ్యాయి? రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగాయా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. భూ రికార్డులు, ప్రభుత్వ శాఖల పాత్ర, ప్రాజెక్టుల పారదర్శకతపై కూడా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై…

Read Full News

జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

Read Full News

నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతిఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై రేపటి నుంచి కఠిన చర్యలు

హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఈ నెల 24వ తేదీ శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. ఒక ఫర్నిచర్ షాప్‌కు సంబంధించిన భవనంలోని సెల్లార్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన ఫర్నిచర్, కుర్చీలు, ఫోమ్, స్పాంజ్ వంటి అత్యంత జ్వలనశీల పదార్థాలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో బయటకు రావడానికి అవకాశం లేక ఐదుగురు దుర్మరణం చెందారు. సెల్లార్లలో వేల సంఖ్యలో ఫర్నిచర్ సామగ్రిని అక్రమంగా నిల్వ చేయడం, ఫైర్…

Read Full News

స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read Full News