తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏబీవీపీ ఆగ్రహం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి
తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే…

