కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేవలం ప్రసంగాలు, నినాదాలతో విజయం సాధ్యం కాదని, ప్రతి పోలింగ్ బూత్‌లో మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే విధ్వంసమే…

Read Full News

ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర కీలకం.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ

ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర కీలకం.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్: రాష్ట్రంలో సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ ప్రక్రియలో పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగిపోకుండా పర్యవేక్షించే బాధ్యతలను బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) నిర్వహిస్తున్నారు. దాదాపు 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి పోలింగ్ బూత్‌లో…

Read Full News

తెలంగాణ కోసం పోరాడింది మేమే.. మళ్లీ కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి అవసరం: బీఆర్ఎస్ నేత”

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం వెనుక ఉన్న కష్టాలు, అనుమానాలు, త్యాగాలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తెలంగాణ వస్తుందనే నమ్మకం కూడా లేని రోజుల్లో కేసీఆర్ ప్రారంభించిన ప్రయాణం నేడు 25 ఏళ్ల చరిత్రగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 1968 నుంచి 1971 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో 370 మంది యువకులు ప్రాణత్యాగం చేసినప్పటికీ రాష్ట్రం సాధ్యం కాలేదని గుర్తు చేశారు. ఆ పరిస్థితుల్లోనే కేసీఆర్ తెలంగాణ…

Read Full News

ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారాలు ఆపాలి.. ప్రజల్లో అపోహలు తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల మహా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న పలు అంశాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారాలపై నాయకులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ నెల 25 నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన…

Read Full News

ఓటర్ లిస్ట్ శుద్ధిపై రాజకీయ దుమారం – ఎస్ఐఆర్‌పై అపోహలు సృష్టిస్తున్న కాంగ్రెస్ : బీజేపీ విమర్శ

ఓటర్ లిస్ట్‌లో తప్పుడు ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, విదేశీ ఓట్ల తొలగింపుపై జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం ముదిరింది. ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ “ఓటు చోరి”గా చిత్రీకరిస్తోందని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓటర్ లిస్ట్ డిలీషన్‌కు స్పష్టమైన నిబంధనలు ఓటర్ లిస్ట్‌లో పేర్లు తొలగించాలంటే ఒక స్పష్టమైన చట్టబద్ధమైన విధానం ఉందని బీజేపీ స్పష్టం చేసింది.ఒకరి ఓటు తొలగించాలంటే తప్పనిసరిగా ఫార్మ్–7 దాఖలు చేయాలి. అలాగే సంబంధిత వ్యక్తి…

Read Full News