తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. 108 సీట్లతో విజయ్ సంచలనం
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల మధ్యే తిరిగిన తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శకం మొదలైనట్టుగా కనిపిస్తోంది. తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ అద్భుతమైన ప్రభంజనం సృష్టించారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం మీడియా ఫోకస్ విజయ్‌పైనే నిలిచింది….

