తెలంగాణలో 22A భూముల కలకలం.. అసలు ఏంటి ఈ నిషేధిత జాబితా? లక్షల ఎకరాలపై ఎందుకీ వివాదం?

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A నిషేధిత జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల రక్షణ కోసం ఉపయోగించిన నిబంధన ఇప్పుడు సామాన్య భూయజమానులకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తమకు స్పష్టమైన పట్టాలు, పాస్‌బుక్స్, పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని భూయజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

Read Full News

తెలంగాణలో 22A ల్యాండ్ వివాదం.. అసలు గేమ్ ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత?

తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 22A జాబితా పేరుతో ప్రైవేట్ భూములు ఇబ్బందులకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఒకవైపు.. 22A నుంచి భూములను తొలగించే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరోవైపు.. ఫేక్ గవర్నమెంట్ మెమోలు, నకిలీ పత్రాలతో భూములపై మోసాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనలు ఇంకోవైపు ఉన్నాయి. అసలు 22A అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న ప్రశ్నలు ఏంటి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 22A అంటే…

Read Full News

22A జాబితాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వివాదం లేని భూములకు విముక్తి? ఈ వారంలోనే కొత్త లిస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా 22Aలో చేర్చడంతో తలెత్తిన వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు 22A జాబితాను సమీక్షించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సవరించిన జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో 22A జాబితాపై కసరత్తు 22A నిషేధిత ఆస్తుల జాబితాలో వివాదం లేని…

Read Full News

గ్రేటర్ ఎన్నికల్లో 22A ఎఫెక్ట్? ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కీలక నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22A నిషేధిత జాబితా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఆస్తులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులు కూడా 22A జాబితాలోకి వచ్చాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, లేఔట్లు, కమర్షియల్ ప్రాపర్టీలుగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు…

Read Full News