ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారా? 1000 రోజులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు భద్రత, వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఒక్కరోజైనా పోరాడారా అని ప్రశ్నించారు. ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట్ మైదానంలో…

