బీజేపీ ఆలస్య స్పందన నుంచి కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి వరకు: తెలంగాణ రాజకీయాల్లో మరిగుతున్న ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా—ప్రజా సమస్యల కంటే రాజకీయ లెక్కలే ముందున్నాయన్న భావన బలపడుతోంది. అంతర్జాతీయంగా మెస్సీ మ్యాచ్ జరిగిపోయిన చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం, “ఇప్పుడు నిద్ర లేచారా?” అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్రంలో ఉన్న మంత్రి వెంటనే చర్యలు తీసుకోవచ్చుగా అనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కూడా అనుమానాలు…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు, అరెస్ట్ ప్రచారం రాజకీయ హైప్ మాత్రమే

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. నోటీసులు అంటేనే అరెస్ట్ అన్నట్లుగా కొందరు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా, వాస్తవ పరిస్థితి అంత తీవ్రమైనది కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టం ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలవాల్సిన అవసరం లేదు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం, అలాంటి వ్యక్తిని ఆయన నివాసంలోనే విచారించాలి. ఇదే విషయాన్ని…

Read Full News

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో మీడియా–మంత్రుల నెక్సస్: బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చుట్టూ వివాదాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో “చిచ్చు పెట్టేది ఎవరు?” అన్న ప్రశ్నే ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక మంత్రుల మధ్య, మీడియా మధ్య నడిచే లోపలి ఆటలే పరిపాలనను గందరగోళంగా మారుస్తున్నాయా? అనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ మొత్తం కథలో కీలకంగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. భట్టి విక్రమార్కే ఈ వివాదానికి కేంద్ర…

Read Full News

ముఖ్యమంత్రి లేని పాలన? తెలంగాణ క్యాబినెట్‌లో గందరగోళం, హై డ్రామా రాజకీయాలు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్‌లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది. బీఆర్‌ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై…

Read Full News

ఎవరికి కట్టారు? ఎమ్మెల్యేల అయోమయం, పార్టీ మార్పులపై రాజకీయ వ్యంగ్యం

తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రజలకు ఒకటే సందేహం – ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?పార్టీ మార్పులు, మాటల మార్పులు, స్టాండ్‌ల మార్పులతో ఎమ్మెల్యేల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. తాజాగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఓపెన్‌గా ప్రకటించారు. అంతే కాదు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం “నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా, నన్ను సస్పెండ్ చేయలేదు,…

Read Full News

రైతు సమస్యల్లో కాంగ్రెస్ పాలన విఫలం: బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

సిద్దిపేట్ మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రైతు సమస్యలపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ₹8,000 మద్దతు ధర (MSP) ప్రకారం రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకోవాలని, మధ్యదళారుల చేత మోసపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు పిలుపునిచ్చారు. దేశంలో పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో ప్రతి సంవత్సరం భారీగా దిగుమతులు చేయాల్సి వస్తోందని…

Read Full News

కేసీఆర్‌కు నోటీసులపై తీవ్ర విమర్శలు: తెలంగాణ గడ్డను అవమానిస్తున్న పాలకులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, రాష్ట్ర అవతరణకు తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటీసులు కేవలం ఒక నాయకుడికి మాత్రమే కాదు, తెలంగాణ గడ్డకే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే అవమానమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై చర్యల పేరుతో జరుగుతున్న వ్యవహారాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. తమ…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read Full News

సొంత ఇంటికి తిరిగొచ్చా”: రాజకీయ మోసాలు, అంతర్గత కుట్రల మధ్య నేత ఆవేదన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీ చప్పట్ల మధ్య తన రాజకీయ ప్రయాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేత, తన బయటికివెళ్లడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కొందరు నాయకులు తనపై, ఇతరులపై బురదజల్లారని, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుట్రపూరిత రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకుల ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తిగా కడియం శ్రీహరి పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య…

Read Full News