తెలంగాణలో 22A భూముల కలకలం.. అసలు ఏంటి ఈ నిషేధిత జాబితా? లక్షల ఎకరాలపై ఎందుకీ వివాదం?
హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A నిషేధిత జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల రక్షణ కోసం ఉపయోగించిన నిబంధన ఇప్పుడు సామాన్య భూయజమానులకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తమకు స్పష్టమైన పట్టాలు, పాస్‌బుక్స్, పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని భూయజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

