జన్జీ ఉద్యమంలో కాంగ్రెస్ హవా.. అసలు ఉద్యమం ఎక్కడ? తెలంగాణలో నిరుద్యోగులపై చర్యలపై రాహుల్‌కు ప్రశ్నలు

ఢిల్లీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్నికల వ్యవస్థ, ఓటు హక్కు అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వైపు ర్యాలీగా బయలుదేరిన ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేసిన అనంతరం, సుమారు మధ్యాహ్నం మూడు…

Read Full News

‘Telangana Rising’ ఎక్కడుంది? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలపై Rakesh Reddy ఫైర్

తెలంగాణలో ప్రస్తుతం ‘Telangana Rising’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో అసలు ఏం రైజ్ అయిందో అర్థం కావడం లేదంటూ BRS నేత రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. తలసరి ఆదాయం, రాష్ట్ర అప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్లు, యువతకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఓ రాజకీయ ఇంటర్వ్యూలో రాకేష్ రెడ్డి చేసిన విమర్శలు….

Read Full News

22A, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ ఏదీ? సభలో మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నల వర్షం!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభా కార్యక్రమాల నిర్వహణ, సభ్యుల సస్పెన్షన్‌, 22A భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యుత్‌ సమస్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభలో లేని సభ్యులను కూడా సస్పెండ్‌ చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. సభా ఉల్లంఘన జరిగినప్పుడు దానిని ప్రశ్నించడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యత అని పేర్కొన్న మహేశ్వర్‌రెడ్డి.. సభ్యుల సస్పెన్షన్‌ ఏ నిబంధనల ప్రకారం జరిగిందో స్పష్టం చేయాలని కోరారు. సభను నడిపించేందుకు కొత్త రూల్‌బుక్‌ ఏమైనా…

Read Full News

విద్యార్థులు రోడ్లపై.. ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణలో విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్క సమస్య కాదు.. అనేక సమస్యలు ఒకేసారి తెరపైకి వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళనలు..పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు..టీచర్ల కొరత..ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఫిర్యాదులు..గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు..ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు.. ఇలా చూస్తే తెలంగాణ విద్యా వ్యవస్థపై అసలు ప్రభుత్వం దృష్టి పెట్టిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో.. ఇన్ని శాఖలను ఒకేసారి…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి స్కూళ్ల వరకు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, విద్యా విధానాలపై వస్తున్న విమర్శలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులని, ఈ రెండు రంగాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు పోలీసుల అడ్డంకులు.. శక్తి స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన తీవ్రతరం అవుతోంది. పాలిటెక్నిక్ కోర్సులను శక్తి స్కీమ్ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. తమ విద్యా వ్యవస్థ, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యపై ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో నిరసనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల…

Read Full News

విద్యార్థుల గళం వినిపిద్దామంటున్న కాంగ్రెస్.. ముందు తెలంగాణలో సభ పెట్టే ధైర్యం ఉందా?

న్యూఢిల్లీ: విద్యార్థులు, యువత సమస్యలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో విద్యార్థుల సమస్యలు, యువత భవిష్యత్తు, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల గళాన్ని బలంగా వినిపించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశంలోని సుమారు 800 నగరాల్లో విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించే అంశంపై CWCలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్…

Read Full News

శక్తి’ స్కీమ్ వద్దు.. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన | లాటరల్ ఎంట్రీ తొలగిస్తే మా భవిష్యత్ ఏంటి?

హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ వ్యవస్థ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఉన్న ప్రత్యేక విద్యా గుర్తింపు, ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలు, బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ వంటి మార్గాలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు…

Read Full News

భూ కేటాయింపులపై అసత్య ప్రచారం చేయొద్దు.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: తెలంగాణలో భూ కేటాయింపులపై అసత్య ప్రచారం చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. నిబంధనల మేరకే భూములను కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఐదు ఎకరాల భూమిని రూ.5.75 కోట్లకు కేటాయించామని, ఇదే భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.90 లక్షల చొప్పున కేటాయించిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. భూ కేటాయింపుల అంశంపై రాజకీయ విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి రావాల్సిన…

Read Full News

జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన వేలాది మంది

రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోమవారం వేలాది మంది ఉద్యోగార్థులు జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు ఇప్పటికే 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ…

Read Full News