KBR Park One-Way Diversions: రెండు సంవత్సరాల ట్రాఫిక్ ఆంక్షలతో హైదరాబాద్ వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్: నగరంలోని కీలక ప్రాంతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (KBR) పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో కొత్త వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ మార్పులతో మొదటి రోజే పలుచోట్ల వాహనదారులు ట్రాఫిక్ రద్దీ, మార్గాలపై అయోమయం, అదనపు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. H-CITI ప్రాజెక్టులో భాగంగా KBR పార్క్ పరిసరాల్లో మల్టీ-లెవల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను…

Read Full News

ఎర్రగడ్డలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. ప్రజల ఆగ్రహం: ఎన్నికల వేళ మళ్లీ హామీలేనా?

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రోడ్లు, డ్రైనేజీ, నీటి నిల్వలు, పార్కింగ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు, ప్రజాప్రతినిధులు బస్తీల్లో తిరిగి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రోడ్లన్నీ జలమయం ఎర్రగడ్డ ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో…

Read Full News

యూటర్న్లు ఎందుకు? ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్ క్లారిటీ.. డ్రగ్స్ తెలంగాణకు పెద్ద ముప్పు

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, యూటర్న్ల వ్యవస్థ, రోడ్డు భద్రత, డ్రగ్స్ ముప్పు, సైబర్ నేరాలపై తెలంగాణ డీజీపీ C. V. Anand కీలక వ్యాఖ్యలు చేశారు. వెయిట్ న్యూస్ కాన్క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రజల్లో ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని వ్యాఖ్యాత ప్రశ్నించగా, యూటర్న్ల వ్యవస్థ వెనుక ట్రాఫిక్ శాస్త్రం ఉందని డీజీపీ వివరించారు. “ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఊరికే యూటర్న్లు పెట్టదు….

Read Full News

ఫిట్ కాప్ నుంచి సైబర్ వార్ వరకు.. తెలంగాణ పోలీసింగ్‌పై డీజీపీ సీవీ ఆనంద్ విజన్

తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ C. V. Anand రాష్ట్ర భద్రత, పోలీసింగ్, ఫిట్‌నెస్, సైబర్ నేరాలు, డ్రగ్స్ సమస్యలపై తన విజన్‌ను వెల్లడించారు. వెయిట్ న్యూస్ కాన్క్లేవ్ 2026 వేదికగా మాట్లాడిన ఆయన, భవిష్యత్ తెలంగాణ పోలీసింగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను వివరించారు. కార్యక్రమంలో మాట్లాడిన డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ శాఖలో ఫిట్‌నెస్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. “స్ట్రెస్‌ను తట్టుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను గత 33 ఏళ్లుగా నా…

Read Full News

కూకట్పల్లి కోసం మాటలు కాదు… పరిష్కారాలు కావాలి” – జాగృతి జనబాట పై విమర్శలు

మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న జాగృతి జనబాట కార్యక్రమం ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగింది. నగరంలో అత్యంత జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి సమస్యలను నాయకులు దగ్గరగా పరిశీలించారు. కూకట్పల్లి నియోజకవర్గం హైదరాబాద్‌లో భాగమైపోయినా అభివృద్ధి మాత్రం కాగితం మీదే ఉందనేది స్థానికుల ఆందోళన. 🚨 “హైదరాబాద్‌కి కామధెనువు… కానీ కూకట్పల్లికి ఒక్క రూపాయి కూడా కాదు” స్థానిక నాయకులు మాట్లాడుతూ: 👉 “కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో కూకట్పల్లిలో 2000 కోట్ల విలువైన భూములు…

Read Full News