మందుబాబులకు మరో షాక్.. ఫుల్ బాటిల్‌పై ₹100 వరకు పెంపు.. త్వరలో కొత్త లిక్కర్ రేట్లు
తెలంగాణలో మందుబాబులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. లిక్కర్ ధరల సవరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ ప్రస్తుతం డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెరిగిన ఉత్పత్తి వ్యయం, ముఖ్యంగా…

