తెలంగాణలోని చిత్రపురి లేఅవుట్పై భారీ అవినీతి ఆరోపణలు గత కొంతకాలంగా మళ్లీ తెరపైకి వచ్చాయి. నిజమైన సినిమా కార్మికులకు కట్టాల్సిన ఇళ్లను, లేఅవుట్‌ను కొందరు తిరగరాసి కోట్ల రూపాయల అక్రమాలు జరిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక నేత కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులను, ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా ముందు బహిర్గతం చేశారు.
“ఆధారాలు ఇచ్చినందుకే మా ఇల్లే తీసేశారు” – కస్తూరి శ్రీనివాస్
సాక్ష్యాలతో, లేఅవుట్ పత్రాలతో అవినీతిని బయటపెట్టినందుకు తాను రిజిస్టర్ చేసిన ఇల్లును రద్దు చేసి తమను లిస్ట్ నుంచి తొలగించడం తీవ్రమైన దౌర్జన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన చెబుతూ…
“చిత్రపురి అవినీతి గురించి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఇవి ఆరోపణలు కాదు — నిజాలు. కాంగ్రెసే నమ్మింది, మేఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు గెలిచిన తర్వాత మమ్మల్ని అడిగినప్పుడు ఆధారాలు ఇచ్చాం. కానీ దండుపాలెం బ్యాచ్ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది.”
600 పేజీల ఒరిజినల్ డాక్యుమెంట్లు – ED, విజిలెన్స్‌కి పంపమన్న రేవంత్
కస్తూరి శ్రీనివాస్ వివరాల ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డికి, సహకార శాఖ అధికారులకు 600 పేజీల ఆర్టీఐ ఆధారాలను అందజేశారు.
“మేము క్రియేట్ చేసినవి కావు – ఇవన్నీ ఒరిజినల్ రికార్డులు. కోట్ల రూపాయల దోపిడీ, తప్పుడు అలాట్మెంట్లు అన్నీ డాక్యుమెంట్లే చెబుతున్నాయి.”
దండుపాలెం బ్యాచ్” అన్న వ్యాఖ్య ఎందుకు?
సినీ కార్మికులు గత ప్రభుత్వ కాలంలో, ప్రస్తుత కాలంలోనూ లేఅవుట్‌ను ఆక్రమించుకున్న ముఠాకు “దండుపాలెం బ్యాచ్” అనే పేరు పెట్టారు.
వారి మాటల్లో…
“దండుపాలెం అంటే ఎదుటివాడి దగ్గర ఉన్న నోటికి వచ్చినది కూడా తినేసే బ్రూటల్ గ్యాంగ్. అదే పరిస్థితి చిత్రపురిలో ఉంది. నిజమైన కార్మికులను బయటకు తోసి, బయటివారికి వేలల్లో మెంబర్‌షిప్‌లు ఇచ్చారు.”
4213 ఫ్లాట్లకు 9350 మెంబర్‌షిప్‌లు? – అతి పెద్ద సభ్యత్వ గజిబిజి
కార్మికులు ఎత్తి చూపుతున్న ముఖ్యమైన అవినీతి ఇదే:
- అసలు ప్లాన్‌లో 4213 ఇళ్లు మాత్రమే
- కానీ ప్రస్తుతం 9350 సభ్యత్వాలు
- అంటే రెండింతలు ఎక్కువ
- చనిపోయిన వారి పేర్లు కూడా లిస్ట్‌లో
- ఇల్లు అమ్మిన పాత ఓనర్ పేరే అలాగే ఉంచి మరోకరికి కొత్త మెంబర్షిప్
- ఓట్లు కోసం గూగుల్ పేతో 10–20 వేల రూపాయలు ఇచ్చి పాత ఓనర్లను రప్పించడం
ఇది స్పష్టమైన బడా రిగ్గింగ్ – కోఆపరేటివ్ సొసైటీ దోపిడీ అని బాధితులు వాపోతున్నారు.
నిజం తప్పితే మీ కాళ్ల దగ్గర పత్రాలు పెట్టి సాష్టాంగం చేస్తాం”
కస్తూరి శ్రీనివాస్ స్పష్టం చేశారు:
“మీడియా సమక్షంలో ఎంక్వైరీ జరిపిస్తే చాలు. మా ఆరోపణల్లో ఒక్కటీ అబద్ధం అయితే ఆ రోజే అన్ని పేపర్లు మీ కాళ్ల దగ్గర పెట్టి నమస్కారం చేసి పోరాటం ఆపేస్తాం.”
డిసిఓ, అధికారులు సహకరించడం లేదని ఆరోపణ
వారిపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు:
- డిసిఓ సుధాకర్, సురేంద్ర మోహన్ వ్యవహారం పాక్షికంగా ఉందని
- ఫిర్యాదుదారులను 10 రోజులు తిప్పడం
- కలెక్టర్ ఆఫీస్‌లో గంటలతరబడి వేచిపెట్టడం
- “నాకు మినిస్టర్ చెప్పాడు, వీరి మెంబర్షిప్ రీస్టోర్ చేయను” అని ప్రకటించడమని ఆరోపించారు.
పోలీసు కేసులు, సోషల్ మీడియాలో వైరల్ వీడియోల తరువాత ఒత్తిడి
పాష యాదగిరి వ్యాఖ్యలు వైరల్ అయ్యాక తమపై నాన్-బైలబుల్ కేసులు పెట్టారని కార్మికులు చెప్తున్నారు.
“మేము చదువుకున్న వాళ్లం, సినిమా క్రాఫ్ట్స్‌లో 25 ఏళ్లు పనిచేసిన వాళ్లం. దండుపాలెం బ్యాచ్‌తో మమ్మల్ని పోల్చడం అవమానం.”
ప్రభుత్వానికి స్పష్టం – “ఈ కేసులపై చర్య తీసుకోకపోతే కాంగ్రెస్ మాయమవుతుంది”
వారి చివరి హెచ్చరిక:
“22 కేసులు ఉన్నాయి. సూపర్ సీడ్లో ఉన్న కమిటీని విచారించండి. ల్యాండ్ గ్రాబింగ్, మెంబర్షిప్ అవినీతి, నిధుల దుర్వినియోగం అన్నిటిపై యాక్షన్ తీసుకోండి.
ఇది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.”

