స్టార్ హీరోపై మనసు పడ్డ యంగ్ బ్యూటీ.. అల్లు అర్జున్ అంటే ఇష్టం, హైదరాబాద్ బిర్యానీకి ఫిదా అయిన అనశ్వర రాజన్

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సెలబ్రిటీలకు కూడా తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఉంటారు. ఆ విషయాలు అప్పుడప్పుడే బయటపెడుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓ యంగ్ బ్యూటీ.

ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్. డిసెంబర్ 25న విడుదల కానున్న ‘ఛాంపియన్’ సినిమాలో రోషన్ మేక సరసన నటిస్తూ ఈమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అంతేకాదు వెంకీ కుడుముల నిర్మాణంలో రూపొందుతున్న ‘ఇట్లు అర్జున’ అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుస తెలుగు ప్రాజెక్టులతో ప్రస్తుతం హైదరాబాదులోనే ఎక్కువ సమయం గడుపుతోంది.

ఈ క్రమంలోనే తెలుగు సినిమా, హైదరాబాద్ సంస్కృతి పట్ల తన అభిమానాన్ని అనశ్వర రాజన్ పంచుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతూ, నగరంలోని రుచులను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని తెలిపింది.

తన అభిమాన హీరోల గురించి మాట్లాడుతూ,
రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాను లెక్కలేనన్నిసార్లు చూశాను. అలాగే తెలుగు నటులలో నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం” అంటూ చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మెగా అభిమానులు కూడా అనశ్వర రాజన్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అనశ్వర రాజన్ నేపథ్యం విషయానికి వస్తే.. 2017లో వచ్చిన ‘ఉదాహరణం సుజాత’ చిత్రంలో బాలనటిగా కనిపించిన ఈమె, 2019లో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర, ఇప్పుడు తొలిసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘7/G రెయిన్‌బో కాలనీ 2’ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. మరి తెలుగులో ఈమెకు ఈ చిత్రాలు ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *