🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్
సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు.
📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం
- నకిలీ వాట్సాప్ గ్రూపులు, ట్రేడింగ్ యాప్స్ ద్వారా మోసం
- “Alpha Alliance Investment Club” పేరుతో నకిలీ ప్లాట్ఫామ్
- వర్చువల్ లాభాలు, నకిలీ IPO కేటాయింపులు చూపించి మభ్యపెట్టారు
- బాధితుడి నుంచి ₹2,90,04,585 యూపీఐ, బ్యాంకు ఖాతాల ద్వారా వసూలు
- బ్యాంక్ ఖాతాలు అందించినందుకు శ్రీకాంత్, శివకాంత్ రాజు, సూర్యభగవాన్ అరెస్ట్
- ప్రధాన నిందితుడు అనిల్ గోయల్ పరారీలో
📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్
- టెలికాం అధికారులు అంటూ ఫోన్ కాల్స్
- చట్టపరమైన చర్యలు అంటూ బెదిరింపులు
- ₹56.50 లక్షలు కాజేసిన మోసగాళ్లు
- ఈ కేసులో కూడా ఇద్దరు నిందితుల అరెస్ట్
🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర
- నల్గొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్లో కలకలం
- 15 రోజుల క్రితమే చైర్మన్గా ఎన్నికైన మందడి ప్రభాకర్ రెడ్డి రాజీనామా
- ఆరోగ్య సమస్యలే కారణమని వివరణ
- మదర్ డైరీలో తరచూ చైర్మన్ల రాజీనామాలు జరగడం చర్చనీయాంశం

