తెలంగాణలో మరోసారి పోలీసుల తీరుపై చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. తనను ఇంటికి వెళ్లనివ్వడం లేదంటూ భరత్ అనే వ్యక్తి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రివెంటివ్ డిటెన్షన్ పేరుతో తనను అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన, “నేను దొంగనా.. క్రిమినలా.. నా ఇంటికి వెళ్లకూడదా?” అంటూ పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులు మాత్రం ఇది సాధారణ ప్రొసీజర్‌లో భాగమని, సహకరించాలని కోరినప్పటికీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ బండిలో ఎందుకు ఎక్కాలి.. మా బండిలోనే వస్తా” అంటూ ఆయన పట్టుబట్టారు. తాను ఎప్పుడూ అబద్ధాలు ఆడనని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రివెంటివ్ డిటెన్షన్ విధానాలపై చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లో ఆయనను అడ్డుకున్నారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

