తెలంగాణలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూపులు: 5000 పోస్టులు కాదు, సమగ్ర జాబ్ క్యాలెండర్ కావాలంటున్న నిరుద్యోగులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతలో నిరాశ, ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదం కీలకంగా మారింది. ప్రత్యేక తెలంగాణ వస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించారు. అయితే, ఆ ఆశలు పూర్తిగా నెరవేరాయా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం 5000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్…

