తిరుమలలో త్రిషా దర్శనం.. విజయ్ ఎన్నికల విజయంతో రిలేషన్ వార్తలు మళ్లీ వైరల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న వేళ మరోవైపు సినీ నటుడు విజయ్, హీరోయిన్ త్రిషా పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న సమయంలో త్రిషా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశమైంది.

ఈరోజు త్రిషా పుట్టినరోజు కావడంతో ప్రత్యేక దర్శనం కోసం తిరుమలకు వెళ్లినట్లు సమాచారం. అయితే అదే రోజున విజయ్ పార్టీ ఎన్నికల్లో భారీ లీడింగ్‌లో ఉండటం కారణంగా, ఈ దర్శనాన్ని చాలామంది రాజకీయ, వ్యక్తిగత కోణాల్లో కూడా చర్చిస్తున్నారు. కొందరు అభిమానులు “విజయ్ విజయం కోసం త్రిషా స్వామివారిని దర్శించుకుంది” అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా, మరికొందరు “పుట్టినరోజు సందర్భంగా సాధారణ దర్శనమే” అని అభిప్రాయపడుతున్నారు.

త్రిషా క్రిస్టియన్ నేపథ్యానికి చెందినప్పటికీ తిరుమలకు వెళ్లడం కూడా సోషల్ మీడియాలో వైరల్ చర్చకు దారి తీసింది. “ఇప్పటివరకు వెళ్లని త్రిషా ఇప్పుడు ఎందుకు వెళ్లింది?” అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే సినీ ప్రముఖులు వివిధ మతాల ఆలయాలను సందర్శించడం కొత్త విషయం కాదని మరికొందరు పేర్కొంటున్నారు.

ఇక విజయ్-త్రిషా రిలేషన్‌షిప్‌పై గత కొంతకాలంగా వస్తున్న వార్తలు కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో విజయ్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య సంగీతతో విభేదాలపై వార్తలు వచ్చిన తర్వాత త్రిషా పేరు ఎక్కువగా వినిపించింది. ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అయ్యాయి.

ఇటీవల ఒక వివాహ వేడుకకు విజయ్, త్రిషా కలిసి హాజరుకావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. దీంతో అభిమానులు వీరిద్దరి మధ్య నిజంగానే ప్రత్యేక సంబంధం ఉందా అనే చర్చ మొదలుపెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు.

విజయ్-త్రిషా జంట తమిళ సినీ పరిశ్రమలో అత్యంత పాపులర్ కాంబినేషన్లలో ఒకటి. 2004లో విడుదలైన “గిల్లి” సినిమాతో మొదలైన వీరి జోడీ, తర్వాత “తిరుపాచి”, “ఆది”, “కురువి”, తాజాగా “లియో” వరకు కొనసాగింది. ముఖ్యంగా “లియో” సినిమాలో కొన్ని సన్నివేశాలు పాత సినిమాల్ని గుర్తు చేసేలా ఉండటంతో అభిమానులు వీరి కెమిస్ట్రీని మరోసారి సెలబ్రేట్ చేశారు.

ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఊహించని స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 234 స్థానాల్లో టీవీకే 100కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అధికారిక ఫలితాలు ఇంకా పూర్తిగా రాకపోయినా, అభిమానులు ఇప్పటికే విజయ్ విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఊహించని స్థాయిలో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 234 స్థానాల్లో టీవీకే 100కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అధికారిక ఫలితాలు ఇంకా పూర్తిగా రాకపోయినా, అభిమానులు ఇప్పటికే విజయ్ విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు.

త్రిషా తిరుమల దర్శనం అనంతరం విజయ్ నివాసానికి వెళ్లిందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్‌ను అభినందించడానికి వెళ్లిందని కొందరు అంటుండగా, మరికొందరు ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమే అంటున్నారు.

ఒకవైపు తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు విజయ్-త్రిషా రిలేషన్‌షిప్ చర్చ సోషల్ మీడియాలో భారీ వైరల్ టాపిక్‌గా మారింది. ఇక అధికారిక ఫలితాలు వెలువడిన తర్వాత తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో, విజయ్ భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *