మల్లంపేట్‌ భూములపై మరో ట్విస్ట్.. 76 మంది ప్లాట్‌ ఓనర్ల సంచలన ఆరోపణలు!

హైదరాబాద్‌ పరిసరాల్లోని మల్లంపేట్‌–బొల్లారం ప్రాంతంలో భూముల వివాదం మరింత ముదురుతోంది. గతంలో చెరువులు, సర్వే నంబర్లు, ఆక్రమణలపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. తాజాగా తమ భూములు కూడా వివాదంలో చిక్కుకున్నాయని 76 మంది ప్లాట్‌ ఓనర్లు ఆరోపిస్తున్నారు. తమ వాదనలకు సంబంధించిన పత్రాలు, వివరాలతో వారు ఓకే టీవీని సంప్రదించారు. ప్లాట్‌ ఓనర్ల వివరాల ప్రకారం.. తాము బొల్లారం పరిధిలోని సర్వే నంబర్‌ 297లో భూములను కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్లాట్లు బొల్లారం సబ్‌స్టేషన్‌ పక్కనే…

Read Full News

22A భూములపై చర్చ ఎప్పుడు? మహేశ్వర్‌రెడ్డి పట్టుబాటు.. సభలో స్పీకర్‌ అంశంపై వాడీవేడి

దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 22A నిషేధిత భూముల అంశం సభలో మరోసారి చర్చకు వచ్చింది. 22A భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, భూదందాలపై ఆధారాలతో సహా వివరాలు బయటపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు నేరుగా సంబంధించిన 22A భూముల అంశంపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని షార్ట్‌ డిస్కషన్‌గా తీసుకుని, భూ నిర్వహణకు…

Read Full News

22A భూములపై చర్చ ఎప్పుడు? అసెంబ్లీలో మహేశ్వర్‌రెడ్డి డిమాండ్.. స్పీకర్‌ అంశంపై అధికారపక్షం కౌంటర్

తెలంగాణ అసెంబ్లీలో 22A నిషేధిత భూముల అంశంపై చర్చ జరపాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దాదాపు ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన కీలకమైన భూ సమస్యపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 22A భూముల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన మహేశ్వర్‌రెడ్డి.. ఆధారాలతో సహా పలు అంశాలను సభ ముందుంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘వేల కోట్ల…

Read Full News

మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read Full News

కొర్రెముల కబ్జాలపై కొరడా.. 150 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు

మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొర్రెముల్లలో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం కదిలింది. దిశా దినపత్రిక వరుస కథనాల తర్వాత రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867తో పాటు పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా…

Read Full News