ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుల తరబడి ధాన్యం తీసుకొచ్చి వేచి చూస్తున్నప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో తేదీన ధాన్యం తీసుకొచ్చి పెట్టినా ఇప్పటివరకు సరైన స్పందన లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
“రెండో తారీకు ధాన్యం తీసుకొచ్చాం. ఇప్పటికి పది రోజులు దాటిపోయాయి. కానీ కాంటాలు మాత్రం వేయడం లేదు. చైర్మన్ కూడా పట్టించుకోవడం లేదు” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ సొంత డబ్బులతో లారీలు పెట్టుకుని బస్తాలు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినా వాటిని తూకం వేయడం లేదని చెబుతున్నారు.
“150 బస్తాలు తీసుకొచ్చాం. కానీ ఇంకా కాంటాలు వేయలేదు. రేపు, ఎల్లుండి అంటూ కాలం గడుపుతున్నారు. బయట బండ్లు నిలిపేస్తున్నారు. లోపలికి రానివ్వడం లేదు” అని రైతులు వాపోతున్నారు. అధికారులు మాటలు మాత్రమే చెబుతున్నారని, కానీ సమస్యకు పరిష్కారం చూపడం లేదని అంటున్నారు.
రైతుల సమస్యలపై స్థానిక చైర్మన్‌ను సంప్రదించినప్పటికీ స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. ఎస్ఐ సైతం రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, కానీ కొనుగోలు ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదని రైతులు చెబుతున్నారు.
రైతుల సమస్యలపై స్థానిక చైర్మన్‌ను సంప్రదించినప్పటికీ స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. ఎస్ఐ సైతం రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని, కానీ కొనుగోలు ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదని రైతులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాల్సి రావడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని, పంట నాణ్యత కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

