బండి సాయి భగీరత్ కేసుపై రాజకీయ రగడ.. కవిత వ్యాఖ్యలకు తీవ్ర ప్రతిస్పందన

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి సాయి భగీరత్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుండగా తాజాగా బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మరోసారి రాజకీయ వేడి పెరిగింది. బాధిత కుటుంబం తరఫున మాట్లాడుతున్న కొందరు నేతలు కవిత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

“తెలంగాణ అమ్మగా ఉండాలనుకుంటున్నాను” అని కవిత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ముందు బాధిత తల్లి ఆవేదనను చూడాలని వారు కోరుతున్నారు. “ఒక చిన్నారి బిడ్డ కోసం తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. కానీ రాజకీయ నాయకులు మాత్రం స్క్రిప్టులు చదువుతున్నట్టుగా మాట్లాడుతున్నారు” అంటూ విమర్శలు గుప్పించారు.

అలాగే ఈ కేసులో మొదటి ఫిర్యాదు ఎవరు చేశారనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. “మే 8న మొదటి కంప్లైంట్ ఇచ్చింది బాధితురాలి తల్లి కాదు, బండి సాయి భగీరత్ స్వయంగా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు” అని పేర్కొన్నారు. ఒక సీనియర్ పోలీస్ అధికారి సూచనతోనే భగీరత్ ముందుగా కంప్లైంట్ ఇచ్చాడని ఆరోపించారు. అదే సమయంలో బాధితురాలి తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు నమోదు కోసం ఎదురుచూస్తోందని చెప్పారు.

భగీరత్ తన ఫిర్యాదులో “మేము కుటుంబంతో కలిసి తిరుపతి, అరుణాచలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలకు వెళ్లాం. కుటుంబ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. కానీ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది” అని పేర్కొన్నట్టు వెల్లడించారు. ఈ ఫిర్యాదు బయటకు వచ్చిన తర్వాతే మొత్తం వ్యవహారం ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు.

ఈ కేసులో కొన్ని మీడియా సంస్థలు మొదట్లో పూర్తి వివరాలు బయటపెట్టలేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. “కొద్దికొద్దిగా విషయాలు బయటకు వస్తుండటంతో తెలంగాణ సమాజం షాక్ కు గురైంది” అని వ్యాఖ్యానించారు.

ఇక మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలు మాత్రం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది. భగీరత్ విచారణకు హాజరవుతాడా? పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *