తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింతగా ముదురుతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ,
“ఇప్పుడు కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు విలువ లేదు. మేము చెప్పిన మాటకు ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రేవంత్ సిటంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తం పార్టీ రేవంత్ పెత్తనంలో నడుస్తుంది” అని ఘాటుగా విమర్శించారు.
ఆయన మరింతగా మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్లు పక్కనపెట్టబడ్డారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వారు కూడా తమ నియోజకవర్గాల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసారి డిపాజిట్లు కూడా రాకపోవచ్చు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టమైన రాజకీయ దిశ లేకుండా పని చేస్తోందని విమర్శించారు.
“రాజకీయ క్లారిటీ లేని ప్రభుత్వం ఎలా నడుస్తుంది? పార్టీలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎలా విశ్వసిస్తారు?” అని ప్రశ్నించారు.
ఆయన ప్రకారం, జగిత్యాల నియోజకవర్గంలో గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకే అన్ని కాంట్రాక్టులు వెళ్తున్నాయని ఆరోపించారు.
“మున్సిపల్ పనులు, వాటర్ ప్రాజెక్టులు, గోదాలు – అన్నీ ఒకే వ్యక్తికి వెళ్తున్నాయి. ఈ వ్యవస్థలో పారదర్శకత ఉందా?” అని నిలదీశారు.
అలాగే జీవన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్ కంపెనీలో షేర్లు కలిగి ఉన్నారని సంచలన ఆరోపణ చేశారు.
“ఆ వివరాలు త్వరలో బయటపెడతాను. కాంగ్రెస్‌లో ఇప్పుడు సెటిల్మెంట్ రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి. నిజమైన కార్యకర్తలు విలువ కోల్పోయారు” అని అన్నారు.
అంతేకాకుండా ఆయన వ్యాఖ్యానిస్తూ,
“రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, వారి ప్రోటోకాల్, గన్‌మన్ ల గురించి ప్రశ్నించాలి. కాంగ్రెస్‌లో వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు కానీ సీనియర్లను అవమానిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ,
రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, వారి ప్రోటోకాల్, గన్‌మన్ ల గురించి ప్రశ్నించాలి. కాంగ్రెస్‌లో వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు కానీ సీనియర్లను అవమానిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ,
“మేము నాలుగు దశాబ్దాలుగా కష్టపడిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు మమ్మల్ని అణగదొక్కుతున్నారు. మేము మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. ఈ అహంకారం కాంగ్రెస్‌ను కిందకు లాగుతుంది” అని హెచ్చరించారు.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, జీవన్ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వంపై సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం.

