గ్యాస్ సిలిండర్ ధరల భారీ పెంపు?.. చిన్న వ్యాపారులపై పెరుగుతున్న భారం
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వార్తలు సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు, 5 కేజీల ఎఫ్టీఎల్ (Free Trade LPG) సిలిండర్ల ధరలు భారీగా పెరిగినట్టు ప్రచారం జరుగుతుండటంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో పెద్ద భారం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గృహావసరాల కోసం ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు…

