News
5000 కాదు.. 19,000 పోలీస్ ఉద్యోగాలే కావాలి: రేవంత్ సర్కార్‌కు నిరుద్యోగుల అల్టిమేటం”
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత మరోసారి రోడ్డెక్కింది. ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న 5,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ తమకు సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 19,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “వెంటనే నోటిఫికేషన్… వెంటనే న్యాయం… వెంటనే నిర్ణయం” అంటూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టిన అభ్యర్థులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను…
మీనాక్షి నటరాజన్‌కు కోర్టుల్లో షాక్.. రాజ్యసభ నామినేషన్ వివాదం రాజకీయ దుమారం
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగలడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అనర్హమని పేర్కొంటూ కొట్టివేయగా, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా ఇదే అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం తీరుపై, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలపై తీవ్ర చర్చ మొదలైంది….
తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…
కేంద్రం కీలక ఆదేశాలు: ఇకపై రీటైల్ పెట్రోల్ బంకుల్లో భారీగా డీజిల్ కొనుగోళ్లకు బ్రేక్.. 90 రోజుల నిషేధం అమలు
దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, ఇంధన సరఫరా వ్యవస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత వినియోగదారులు సాధారణ రీటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. రాబోయే…
గ్రహిణుల శ్రమ అమూల్యం.. నెలకు రూ.30 వేలకు పైగానే విలువ: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
దేశంలోని కోట్లాది మంది గృహిణుల శ్రమకు గౌరవం దక్కేలా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇంటి పనులు చేసే మహిళలు కేవలం కుటుంబ సభ్యులపై ఆధారపడి జీవిస్తున్నారనే సామాజిక భావన పూర్తిగా తప్పని స్పష్టం చేస్తూ, గృహిణుల సేవలకు ఆర్థిక విలువ ఉందని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. ఒక కుటుంబం సజావుగా నడవడంలో గృహిణి పాత్ర అమూల్యమని పేర్కొన్న సుప్రీంకోర్టు, ప్రమాదవశాత్తు ఒక గృహిణి మరణిస్తే ఆమె అందించే సేవలను ద్రవ్య…
భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి
భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…
టీజీపీఎస్సీ అప్లికేషన్ ఫీజులపై 400% పెంపు.. నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ భారీ షాక్
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అదే నిరుద్యోగులపై అప్లికేషన్ ఫీజుల రూపంలో అదనపు భారం మోపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసిన ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లలో దరఖాస్తు రుసుములను భారీగా పెంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో…
కామారెడ్డి కాంగ్రెస్‌లో మహిళా నాయకురాలిపై అసభ్య పోస్టులు.. షబ్బీర్ అలీ వివాదంపై అధిష్టానం మౌనం ఎందుకు?
కామారెడ్డి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి వివాదం కేవలం రాజకీయ భేదాభిప్రాయాలకే పరిమితం కాకుండా మహిళా నాయకురాలిపై వ్యక్తిగత స్థాయిలో అసభ్యకర ప్రచారం జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న స్థానిక నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల అనంతరం, వారినే లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో…
మోడీ పాలనకు 12 ఏళ్లు: కరీంనగర్లో ‘స్వచ్ఛ పాఠశాల’ సేవా కార్యక్రమాలతో బీజేపీ వినూత్న ముందడుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రైతు సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, మేధావుల సమావేశాలు, టిఫిన్ బైఠక్‌లు వంటి పలు…
“రైతులపై ప్రజా వంచన పాలన.. కాళేశ్వరం పునరుద్ధరణతోనే తెలంగాణకు మంచి రోజులు: బీఆర్ఎస్ విమర్శలు”
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని, ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఏర్పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ, రెండు పియర్లు దెబ్బతిన్నప్పటికీ 30 నెలలు గడిచినా మరమ్మతులు పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, అనేక జిల్లాల…

