దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై తీవ్ర అభ్యంతరం.. “రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం”

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న డిమాండ్‌పై దళిత సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అనేది కేవలం సంక్షేమ పథకం కాదని, అది ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న వ్యవస్థ అని పేర్కొన్నారు. మత మార్పిడి చేసుకున్న వారికి ఇప్పటికే బీసీ వర్గీకరణతో పాటు మైనారిటీ హక్కులు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, కమిషన్లు వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం హిందూ మతాన్ని విడిచి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేశారు. అనంతరం 1956లో సిక్కులను, 1990లో బౌద్ధులను ఎస్సీ జాబితాలో చేర్చిన విషయాన్ని గుర్తుచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.

క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తే భవిష్యత్తులో ముస్లింలకూ అదే హక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, దీంతో అసలు దళిత వర్గాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు అనేవి చారిత్రక వివక్షకు గురైన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకే ఉద్దేశించబడ్డాయని తెలిపారు.

క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తే భవిష్యత్తులో ముస్లింలకూ అదే హక్కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, దీంతో అసలు దళిత వర్గాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు అనేవి చారిత్రక వివక్షకు గురైన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకే ఉద్దేశించబడ్డాయని తెలిపారు.

అదేవిధంగా మైనారిటీలకు ఇప్పటికే ప్రత్యేక విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, కమిషన్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లను కూడా కోరడం సమంజసం కాదని విమర్శించారు. దళిత సమాజం ఎదుర్కొన్న సామాజిక వివక్ష, అంటరానితనం, వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు.

ఈ అంశంపై భావోద్వేగాలతో కాకుండా రాజ్యాంగం, చట్టాలు, చారిత్రక వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని దళిత సంఘాల నేతలు మీడియాను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *