దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇద్దరు యువతులపై ఓ గ్యాంగ్ దారుణంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తర్వాత వారిపై కర్రలతో దాడి చేసి దుస్తులు చింపివేసినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు సహాయం చేయకుండా కేవలం చూస్తూ నిలబడటం.
ఆదివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన నెహ్రూ ప్లేస్‌లో ఇద్దరు యువతులు ఓ టీ షాప్ వద్ద టీ తాగుతున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు యువకులు వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ యువతులు ధైర్యంగా స్పందించి వారిని నిలదీశారు. దీంతో అవమానంగా భావించిన ఆ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే అసలు ఘటన ఆ తర్వాతే చోటుచేసుకుంది. కొంతసేపటి తర్వాత అదే యువకులు మరికొంతమందిని వెంటబెట్టుకుని తిరిగి అక్కడికి వచ్చారు. ఈసారి వారు గొడవ పెట్టుకోవడానికి కాకుండా దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. యువతులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారిని వెంబడించి వెదురు కర్రలతో దారుణంగా కొట్టినట్టు సమాచారం. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ వారి దుస్తులు కూడా చింపివేసినట్టు తెలుస్తోంది.
బాధితులు సహాయం కోసం కేకలు వేస్తున్నా అక్కడున్న ప్రజలు ముందుకు రాలేదని సమాచారం. కొందరు చూస్తూ నవ్వారే తప్ప కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. “మేము పారిపోవడానికి ప్రయత్నించినా వదలలేదు. అక్కడున్న వాళ్లు మమ్మల్ని కాపాడకుండా చూస్తూ నిల్చున్నారు” అంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నెహ్రూ ప్లేస్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీల

