నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ కూటమి విజయం సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ విజయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన రాజకీయ వ్యూహాలు, ప్రచార శైలి కీలక పాత్ర పోషించాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం పెద్ద ఎత్తున ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నేరుగా కేరళ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని “మీ సమయం అయిపోయింది.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
అంతేకాకుండా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కేరళ ప్రజలకు వివరించడం కూడా ప్రచారంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలపై ప్రత్యేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. “తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో వచ్చి చూడండి” అంటూ కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాయడం అప్పట్లో పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది.
ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామ గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా “సిపిఎంకు వేసే ఓటు బిజెపికి లాభం చేకూరుస్తుంది” అని రేవంత్ రెడ్డి నేరుగా చెప్పడం కేరళ రాజకీయాల్లో కీలక మలుపుగా మారిందని చెబుతున్నారు.
కేరళ ఓటర్లు రాజకీయ అవగాహన కలిగిన ప్రజలు అని, వారు పరిస్థితులను బేరీజు వేసుకుని ఓటు వేస్తారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. మోడీ పర్యటనలు, బిజెపి ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రజలు ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో యుడిఎఫ్ విజయానికి ముందస్తు వ్యూహంతో పని చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సరసన దక్షిణ భారతంలో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో యుడిఎఫ్ విజయానికి ముందస్తు వ్యూహంతో పని చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సరసన దక్షిణ భారతంలో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణలో బిజెపి, బిఆర్ఎస్ కలిసి వచ్చినా రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేరళలో యుడిఎఫ్ విజయంతో రేవంత్ రెడ్డి ప్రచార శైలి, రాజకీయ వ్యూహం మరోసారి సక్సెస్ అయిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేరళలో కాంగ్రెస్ కూటమి విజయంతో దేశ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందని, ఇందులో తెలంగాణ సీఎం పాత్ర ప్రత్యేకమని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

