వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు.
“నా తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ, ఆయన అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను ఇక్కడే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను” అని ఆమె చెప్పారు.
తాను రాజకీయాల్లోకి రావడం వారసత్వం కోసమో కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితోనే అని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకు మరింత సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలిపారు.
మొత్తం మున్సిపాలిటీలో 17 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయని, అందులో 17వ వార్డు నుంచి తాను పోటీ చేస్తున్నానని వివరించారు. తమ పార్టీ అభ్యర్థులందరూ గెలిస్తే, వికారాబాద్‌ను ఒక మంచి నగరంగా అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
వికారాబాద్‌ను టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పనిచేయడమే లక్ష్యం అని చెప్పారు. ఈ దిశగా ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోరుతున్నానని పేర్కొన్నారు.
చివరగా, తనకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

