సెక్రటేరియట్‌లో విజిటర్ అవర్స్ ఫెయిల్?.. అధికారులు లేక ప్రజల ఆవేదన

తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన విజిటర్ అవర్స్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ప్రజలు ఎంట్రీ పాస్ తీసుకొని అధికారులను కలిసేలా ప్రత్యేక సమయం కేటాయించింది. కానీ ఆ సమయంలోనే మెజారిటీ ఐఏఎస్ అధికారులు తమ ఛాంబర్లలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి…

Read Full News

ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల పరిశీలన.. పెండింగ్ బిల్లులపై సర్కార్ హామీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎస్ K. Ramakrishna Rao తెలిపారు. అలాగే జూన్ 2 నుంచి క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కూడా హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో,…

Read Full News

ఉస్మానియా-గాంధీలో పాతుకుపోయిన ప్రొఫెసర్లు.. బదిలీలు తప్పించుకునేందుకు భారీ లాబీయింగ్?

తెలంగాణ వైద్యశాఖలో బదిలీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో నాలుగైదు సంవత్సరాలకోసారి ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. అయితే ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ టీచింగ్ ఆసుపత్రుల్లో మాత్రం కొందరు ప్రొఫెసర్లు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా అదే స్థానాల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో కూడా తమను ఇతర ప్రాంతాలకు పంపకుండా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read Full News

ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు… హామీలు అమలు చేయాలంటూ ప్రభుత్వంపై డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం ఇచ్చి, జీవో మరియు గెజిట్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే…

Read Full News

తెలంగాణలో క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్… రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఇంకా స్పష్టత లేదు

రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. సచివాలయంలో జరిగిన దీర్ఘకాలిక సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ఆర్థిక రక్షణకు సంబంధించిన కొత్త విధానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. కొత్త…

Read Full News

15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్… ఉద్యోగులకు శుభవార్త, కానీ జీతాల సమస్యలపై ఆందోళనలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 15 రోజుల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయంలో కే. రామకృష్ణ రావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రత్యేక ప్రధాన…

Read Full News

హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read Full News

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read Full News