గర్భంలోని శిశువు మెదడుకు గాలి కాలుష్యం ముప్పా? గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం (Air Pollution) తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ పనుల వల్ల ఏర్పడే దుమ్ము, చెత్తను కాల్చడం వంటి కారణాలతో గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఇప్పటివరకు గాలి కాలుష్యం వల్ల దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని ఎక్కువ మంది భావించేవారు. అయితే తాజా పరిశోధనలు గర్భిణీలు పీల్చే కాలుష్య గాలి గర్భంలోని శిశువు మెదడు అభివృద్ధిపై కూడా ప్రభావం చూపే అవకాశం…

Read Full News

గంటకు ఐదు నిమిషాలు నడిస్తే చాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్!

ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉదయం ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటుగా మారింది. రోజూ జిమ్‌కు వెళ్లడం లేదా అరగంట వాకింగ్ చేయడం వల్ల రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాలన్నీ తగ్గిపోతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే తాజా పరిశోధనలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,…

Read Full News

టీమ్స్ కోసం ఉస్మానియా, గాంధీ ఖాళీనా? 180 మంది డాక్టర్ల డిప్యూటేషన్‌పై తీవ్ర విమర్శలు

టీమ్స్ కోసం ఉస్మానియా, గాంధీ ఖాళీనా? 180 మంది డాక్టర్ల డిప్యూటేషన్‌పై తీవ్ర విమర్శలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్) ఆస్పత్రి ప్రారంభానికి ముందే వివాదంలో చిక్కుకుంది. కొత్త ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించకుండా, ఇప్పటికే సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి పెద్ద సంఖ్యలో డాక్టర్లను డిప్యూటేషన్‌పై బదిలీ చేయడంపై వైద్య వర్గాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్…

Read Full News

హైదరాబాద్‌లో చేప ప్రసాదం ప్రారంభం.. లక్షలాది మంది భక్తుల రద్దీ, భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ కోసం భారీ ఏర్పాట్లు చేయగా, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చేప ప్రసాదం ఉపయోగపడుతుందనే విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై మరుసటి…

Read Full News

మృగశిర కార్తె చేప ప్రసాదం నేడు ప్రారంభం.. లక్షలాది ఆస్తమా బాధితుల రాకకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మృగశిర కార్తె చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆస్తమా మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. కార్యక్రమం నిరవధికంగా 24 గంటల పాటు కొనసాగనుండగా, అనంతరం దూద్‌బౌలిలోని బత్తిన కుటుంబ నివాసంలో మరో మూడు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది….

Read Full News

బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది. రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి…

Read Full News

కరోనా తర్వాత మరో వైరస్ భయం? అట్లాంటిక్ క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కలకలం.. అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం?

ప్రపంచాన్ని ఒకప్పుడు కరోనా వైరస్ వణికించినట్లే ఇప్పుడు మరో వైరస్ పేరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. అదే హంటా వైరస్. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ షిప్‌లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ముగ్గురు మరణించగా మరికొంతమంది అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం, డచ్ సంస్థకు చెందిన MV Hondius అనే క్రూయిజ్ నౌకలో హంటా వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ…

Read Full News

ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం – ఓఆర్ఎస్ పేరుతో మోసం చేసే డ్రింక్స్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం

దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు గట్టి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్‌లపై “ORS” (Oral Rehydration Salts) అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. డీహైడ్రేషన్‌ నివారణ పేరుతో మార్కెట్లో లభిస్తున్న కొన్ని పానీయాలు వాస్తవ ఓఆర్ఎస్ ఫార్ములాతో సంబంధం లేకుండా, దానికంటే పది రెట్లు ఎక్కువ చక్కెర కలిగి ఉన్నట్లు బయటపడింది. ఈ అధిక…

Read Full News

బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా హార్ట్‌అటాక్‌ – నడిరోడ్డుపై బీభత్సం!

ఈ మధ్యకాలంలో సడన్ హార్ట్‌అటాక్‌లతో మరణిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా, యవకులు, మధ్యవయస్కులు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక ఘటన ఈ భయాన్ని మరింత పెంచింది. 🚌 నడిపే సమయంలో గుండెపోటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో, ఒక బస్సు డ్రైవర్‌ తన బస్సును నడుపుతుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.దీంతో బస్సు నియంత్రణ తప్పి ముందున్న వాహనాలపై బలంగా దూసుకెళ్లింది. తీవ్ర ప్రమాదం –…

Read Full News