మోతీనగర్‌లో ప్రజల కష్టాలు.. రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలతో ఇబ్బందులు
హైదరాబాద్ మోతీనగర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ మౌలిక వసతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, దోమల బెడద, పింఛన్లు, ఇళ్ల సమస్య తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వర్షాలు వస్తే…

