News
తెలంగాణలో ఎండల ఎమర్జెన్సీ.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలకు హై అలర్ట్ జారీ
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ ప్రజలకు అత్యంత కీలక హెచ్చరిక. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే 48 గంటల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భానుడు…
బండి సంజయ్‌కు పదవి గండమా?.. ఢిల్లీ టూర్‌తో తెలంగాణ బీజేపీలో కలకలం
తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత Bandi Sanjay Kumar చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీ పర్యటన, తెలంగాణ బీజేపీ నేత Ramchander Rao ఢిల్లీకి వెళ్లడం, అక్కడ దాదాపు 48 గంటలకు పైగా కీలక సమావేశాలు జరగడం… ఇవన్నీ కలిసి బీజేపీలో పెద్ద మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక…
1500 ఎకరాల్లో డేటా సిటీ.. రైతుల భూముల పరిస్థితి ఏంటి? తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కుతాయా?
హైదరాబాద్ చుట్టూ “ఫ్యూచర్ సిటీ”, “డేటా సిటీ”, “ఇన్వెస్ట్ తెలంగాణ” పేర్లతో ప్రభుత్వం భారీ ప్రణాళికలు ప్రకటిస్తుండగా ఇప్పుడు ప్రధాన చర్చ భూములపైనే నడుస్తోంది. 1500 ఎకరాల్లో డేటా సిటీ నిర్మాణం, పరిశ్రమల పార్కులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా… అసలు ఈ భూములు ఎక్కడి నుంచి వస్తాయి? రైతుల పరిస్థితి ఏంటి? స్థానిక యువతకు ఉద్యోగాలు ఎంతవరకు వస్తాయి? అన్న ప్రశ్నలు మాత్రం తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్నది అభివృద్ధి,…
ఫుట్‌పాత్‌లపై అక్రమాలు తొలగించాలి.. జీహెచ్‌ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై పెరుగుతున్న అక్రమ ఆక్రమణలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. జూన్ 9లోపు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొబ్బరి బోండాలు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫ్రూట్ బండ్లు, ఇతర చిన్న వ్యాపారాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది….
రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ..? నిరుద్యోగుల ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మళ్లీ ఉధృతమయ్యాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత మరోసారి ధర్నాకు దిగింది. గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న నిరుద్యోగులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో…
అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు
ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్‌పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…
బీజేపీ జెండాతోనే చావాలి”.. కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్‌తో బీజేపీ నాయకుడు బండి సంజయ్ వార్తల్లో నిలిచారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఆయన, అలాంటి “ఫాల్తూ ఆలోచనలు” తనకు రావని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీపై తనకున్న కమిట్మెంట్‌ను వివరిస్తూ బండి సంజయ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చచ్చిపోయిన తర్వాత నా మీద బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో…
కేంద్ర మంత్రి కొడుకు కేసులో ఉచ్చు బిగుస్తుందా?.. కొత్త సెక్షన్లతో జీవిత ఖైదు ఛాన్స్!
కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన సంచలన కేసులో రోజు రోజుకీ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ, తాజాగా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట సరెండర్ చేశాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అనే అంశంపై వివాదం నెలకొన్నా, చివరకు నిందితుడిని కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపించింది. ఇప్పటికే పలు తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు, తాజాగా మరికొన్ని…
గో సంరక్షణ కోసం మోతినగర్‌లో భారీ ధర్నా.. బబుల్గూడా గోవుల సంతకు హిందూ సంఘాల వ్యతిరేకత
హైదరాబాద్ మోతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గో సంరక్షణ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్, విహెచ్‌పీ, పలు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బబుల్గూడాలో నిర్వహించబోతున్న గోవుల సంతకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గోవులను అమ్మకానికి తీసుకెళ్లి తర్వాత వాటిని హతమార్చి మాంసం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోవు హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం కలిగినదని, గో సంరక్షణ…
ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మకాలపై ఫార్మసీల బంద్.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా?
తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మే 20న డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుతో అనేక చిన్న పెద్ద మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ మెడిసిన్ సర్వీసులు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్న పెద్ద ఫార్మసీ చైన్ సంస్థల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా మెడిప్లస్, అపోలో వంటి పెద్ద ఫార్మసీ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం…

