డైల్ 100కు గుడ్‌బై.. తెలంగాణలో ఇక అత్యవసర సేవలన్నీ ఒకే నంబర్ 112తోనే!

తెలంగాణలో డైల్ 112 ప్రారంభం.. ఇక అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్ నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో అత్యవసర సేవల వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు పోలీసు సహాయం కోసం 100, అగ్నిమాపక సేవల కోసం 101, అంబులెన్స్ కోసం 108 వంటి వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ గందరగోళానికి ముగింపు పలుకుతూ ప్రభుత్వం డైల్ 112 పేరుతో ఒకే అత్యవసర హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని…

Read Full News

గ్యాస్ ఈ-కేవైసీ గడువు ఆగస్టు 16తో ముగింపు.. స్టార్ హాస్పిటల్ డేటా లీక్ కలకలం!

గ్యాస్ ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్.. వినియోగదారుల్లో ఆందోళన వంట గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు సూచించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 16 వరకు గడువు ఉండటంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. బోగస్ గ్యాస్ కనెక్షన్లను గుర్తించి తొలగించడం, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సబ్సిడీ, సరఫరా అందేలా చూడడమే ఈ-కేవైసీ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు….

Read Full News

వ్యూస్ కోసం అసభ్యకర కంటెంట్.. ‘ఫ్రెండ్ యాప్’పై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి

సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి విషయాలపై వీడియోలు చేస్తే పెద్దగా ఆదరణ లభించకపోయినా, వివాదాస్పదం, అసభ్యకరం లేదా సంచలనాత్మక అంశాలతో కూడిన వీడియోలు మాత్రం నిమిషాల్లోనే వేలాది వ్యూస్ సంపాదిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా కొందరు నిందితులు “వ్యూస్, లైక్స్ కోసం అలాంటి వీడియోలు చేశాం” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, సమాజంలో సోషల్…

Read Full News

నకిలీ ఫోన్‌పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్‌పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

Read Full News

మళ్లీ యాక్టివ్ అయిన ఐబొమ్మ.. పైరసీ వెబ్‌సైట్లపై పెరుగుతున్న ఆందోళన

తెలుగు సినిమాలను అక్రమంగా ప్రసారం చేసే పైరసీ వెబ్‌సైట్లు మళ్లీ యాక్టివ్ కావడం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా iBOMMA, బప్పం టీవీ, మూవీ రూల్స్ వంటి వెబ్‌సైట్లు కొత్త డొమైన్లతో తిరిగి అందుబాటులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలు, తమిళ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ సైట్లలో దర్శనం ఇవ్వడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలల క్రితం iBOMMA Ravi అరెస్ట్ తర్వాత ఈ సైట్లు నిలిచిపోయినట్టే కనిపించాయి. అప్పట్లో భారీగా…

Read Full News

తీయని మాటల్లో ట్రాప్.. చాటింగ్‌తో చీటింగ్, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాలు

సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, వీడియో కాల్స్ పెరిగిన ఈ డిజిటల్ యుగంలో మరో ప్రమాదకరమైన సైబర్ నేరం వేగంగా విస్తరిస్తోంది. అదే “హనీ ట్రాప్”. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, తీయని మాటలతో యువతను మాత్రమే కాదు పెద్ద పెద్ద అధికారులను కూడా ఉచ్చులో పడేస్తున్న ముఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొదట ఫ్రెండ్లీ చాటింగ్‌తో మొదలయ్యే ఈ ట్రాప్, తర్వాత వ్యక్తిగత సంబంధాల దాకా తీసుకెళ్తుంది. అవతల మాట్లాడేది…

Read Full News

ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read Full News

బ్యాంకు ఉద్యోగులే మోసగాళ్లకు తోడా? ఆపరేషన్ ఆక్టోపస్-2లో 150 కోట్ల సైబర్ స్కాం బహిర్గతం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రజలు నమ్మే బ్యాంకు వ్యవస్థలోనే కొంతమంది ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని తాజా దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో ఈ భారీ మోసం బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు 350 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850కు పైగా సైబర్…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు: నాలుగేండ్లలో ₹4724 కోట్ల దోపిడీ – అప్రమత్తంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు విస్తరించిన కొద్దీ, సైబర్ మోసగాళ్లకు అవకాశాలు కూడా పెరిగాయి. గత నాలుగేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹4724 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుండి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 76,048 కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నారని అంచనా. 📊 సంవత్సరాల వారీగా…

Read Full News