చేయూత పెన్షన్లలో భారీ అక్రమాలు బట్టబయలు.. మరణించిన వారి పేర్లపైనా కొనసాగిన పెన్షన్లు!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియలో వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న 19.4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 15.93 లక్షల మంది లైవ్ ఆథెంటికేషన్ పూర్తి చేశారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 83.88 శాతం…

Read Full News

మాధవనగర్ ఫ్లైఓవర్ పనుల్లో జాప్యం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ ఆగ్రహం

నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా నిజామాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాధవనగర్ ఫ్లైఓవర్ నిజామాబాద్ పట్టణ ప్రజల చిరకాల స్వప్న ప్రాజెక్ట్ అని పేర్కొన్న అరవింద్, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం…

Read Full News

పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనపై ప్రజల అంచనాలు నెరవేరాయా?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన చర్చ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించే సాగుతోంది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు ఎంతవరకు జరిగిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను…

Read Full News

కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read Full News

‘37 ఏళ్లు సేవ చేశాం.. ఇప్పుడు బకాయిల కోసం పోరాడుతున్నాం’.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం మరోసారి ఆందోళన బాట పట్టారు. బస్ భవన్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 37 సంవత్సరాలకు పైగా ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు సరైన పెన్షన్ సౌకర్యం లేదని, నెలకు…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం నిరసన.. పోలీసుల అడ్డగింతపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ పోలీసు సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో పోలీసుల అడ్డగింత చోటుచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తాము శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి వెళ్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పదవీ విరమణ అనంతరం…

Read Full News

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ ఖండించారు. గురుకుల టెండర్లలో ఎలాంటి స్కామ్ జరగలేదని, ప్రతిపక్ష పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన “మంత్రులతో ముఖాముఖి” కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యకు…

Read Full News

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం నిలిచిపోయాయని…

Read Full News

ప్రభుత్వ విద్యను ప్రైవేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నూతన విద్యా సంస్కరణలను అమలు చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ప్రధాన శక్తి విద్యేనని, విద్యావంతులైన యువతే రేపటి తెలంగాణకు బలమైన…

Read Full News

తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏబీవీపీ ఆగ్రహం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి

తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే రేషనలైజేషన్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే…

Read Full News