టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు—సజనార్ సూచనపై పోలీసుల సీరియస్ ఫోకస్

సమాజంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై తెలంగాణ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ అంశం పై ఇప్పటికే సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, ముఖ్యంగా సీపీఎస్ సజనార్ గారు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం.

స్క్యామ్‌లు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని బైప్రొడక్ట్‌గా చెడు కూడా పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

టెక్నాలజీ ప్రయోజనాలతో పాటు ముప్పులు కూడా ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కొత్త చట్టాలు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో ముందుకెళ్తున్నాయి.

ప్రజల భద్రతకు, భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *