ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు గుడ్ న్యూస్.. క్యాష్ జీతాలకు చెక్, డబుల్ ఓవర్‌టైమ్ పే అమలు!
రాష్ట్రంలోని ప్రైవేట్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. కార్మికుల వేతనాల చెల్లింపు వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంతో పాటు వారి హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై కార్మికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించడం నిషేధం కానుంది. ప్రభుత్వం మే 30న జారీ చేసిన జీఓ నెంబర్ 6 ప్రకారం రాష్ట్రంలో ఏ రంగానికి చెందిన ప్రైవేట్ లేదా కాంట్రాక్ట్…

